అదిలాబాద్ రూరల్: తిమ్మాపూర్ లో మహిళా శక్తి పథకం ద్వారా అందించిన పిండి గిర్ని,ఆయిల్ మిల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు సిరికొండ మండలంలో పర్యటించారు. తిమ్మాపూర్ గ్రామంలోని గిరిజన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు,ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు అందించిన పిండిగిర్ని, ఆయిల్ మిల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.పల్లి నూనె తీసే విధానాన్ని పరిశీలించి,పల్లి నూనె తో పాటు పలు రకాల నూనెలను పరిశీలించారు.ఇందిరా మహిళా శక్తి పథకంను మహిళలందరూ సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని ఆన్నారు.