ఎరువులు పురుగుమందుల ఆన్లైన్ విక్రయాలకు వ్యతిరేకంగా ఆత్మకూరులో స్వచ్ఛందంగా మందుల దుకాణాలు షాపులు బంద్ చేసిన యజమానులు
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎరువులు, పురుగుల మందుల వ్యాపారులు ఆన్‌లైన్ విక్రయాలకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ కొనసాగగా, ఆత్మకూరులో కూడా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.ఎరువులు, పురుగుల మందులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఆన్‌లైన్‌లో విక్రయించకుండా, కేవలం గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే విక్రయాలు జరగాలి. ఆన్‌లైన్ విక్రయాల వల్ల స్థానిక డీలర్లు తీవ్ర నష్టాలు ఎదురుకొంటున్నారు అన్ఇ అన్నారు.