కోడుమూరు మండలంలోనిశుక్రవారం లద్దగిరి గ్రామం వద్ద హంద్రీ–నీవా కాలువలో శుక్రవారం గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. పూర్తిగా ఛిద్రమైన స్థితిలో దేహం కనిపించడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా విషాద వాతావరణాన్ని సృష్టించింది.స్థానికుల సమాచారం మేరకు చేరుకున్న కోడుమూరు పోలీసులు మృతదేహాన్ని కాలువ నుంచి వెలికితీసి, ఘటనను నమోదు చేశారు. యువకుడి మరణం హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణాల్లో విచారణ ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.అతని గుర్తింపు కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.