విశాఖపట్నం: సూర్య బాగ్ లో ఓ వ్యక్తి లాడ్జిలో ఆత్మహత్య చేసుకోబోతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు కాపాడి ఆసుపత్రికి తరలించారు
నగరంలో ఎంవీపి కాలనీలో నివాసముంటున్న భైరవపట్ల శ్రీరామ్ (41) హెచ్డిఎఫ్సి బ్యాంకులోని మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవ్వడంతో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం సూర్యబాగ్ లోని ఉన్న హోటల్ శ్రీ రాఘవేంద్రలోని గది తీసుకొని పెస్టిసైడ్ టఫ్గర్ అనే పురుగుల మందు సేవించాడు. కాసేపటికి గది నుంచి పురుగుల మందు వాసన రావడంతో అక్కడి సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా, సీఐ వీవీసీఎం ఎర్రం నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ కోల్లి సతీష్, కానిస్టేబుళ్లు నారాయణ, శివ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.