హిందూపురం పట్టణంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన సబ్ డివిజనల్ పోలీసులు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా డీఎస్పీ కె.వి మహేష్ ఆధ్వర్యంలో సిఐలు రాజగోపాల్ నాయుడు. జనార్ధన్. ఆంజనేయులు.అబ్దుల్ కరీం.పోలీసులు.విద్యార్థిని విద్యార్థులతో కలిసి అమరవీరుల దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. జోహార్ పోలీస్ అమరవీరులు. అమర్ రహే పోలీస్ అమరవీరులు అనే నినాదాలు చేశారు. రహమత్పూర్ లో ఉన్న పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. డిఎస్పి మహేష్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ఉంటూ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థంగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.