చందుర్తి: రామారావుపల్లెలో భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన భర్త, తీవ్ర గాయాలు, కేసు నమోదు చేసిన పోలీసులు
భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టిన భర్త.. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి చందుర్తి మండలం రామారావుపల్లెలో భార్యను భర్త క్రికెట్ బ్యాట్‌తో కొట్టి గాయపరిచిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సల్ల సంపత్ కుమార్ తన భార్య లహరిని క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చుట్టుపక్కల వారు 108కి సమాచారం అందించగా, అంబులెన్స్ సిబ్బంది లహరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.