ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పీటీఎలూ ఆధ్వర్యంలో ధర్నా.. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్..
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ విరమించాలని డిమాండ్..ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం పీటీఎలూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నేతలు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రైవేట్ అధ్యాపకుల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కళాశాలల బంద్ కారణంగా అధ్యాపకులు రోడ్డున పడ్డారని జిల్లా నేత చాంద్ బాషా విమర్శించారు.