ఒంగోలు అర్బన్: పాలకులు నచ్చకపోతే ప్రజలు మారుస్తారు కానీ ఉద్యోగులైన మమల్ని మార్చడం సరికాదు : అంగన్వాడీలు
Ongole Urban, Prakasam | Jul 31, 2026
పాలకులు నచ్చకపోతే ఓటు ద్వారా ప్రజలు మారుస్తారు ఉద్యోగులమైన మమ్మల్ని మార్చటం సరికాదని అంగన్వాడీలు తెలిపారు.శుక్రవారం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రకరకాల యాప్లతో ఒత్తిడి పెరిగిందని, ఫోన్ ద్వారా చేస్తుంటే అవి పనిచేయడం లేదంటున్నారు.యాప్లను రద్దు చేయాలని కోరుతున్నారు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించి గ్రాడ్యుటీ అమలు చేసి పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలంటూన్నారు ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందనం పథకాన్ని అందరికీ వర్తింపచేయాలంటున్నారు. అంగన్వాడి ఆయాలను రాజకీయాల్లో కోసం ఇష్టానుసారంగా మార్చడం సరికాదన్నారు. నిరసన అనంతరం ఏ ఓ కు వినత పత్రం అందజేశారు