నారా లోకేష్ తో కలిసి భక్త కనకదాసు విగ్రహావిష్కరణలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.
కళ్యాణదుర్గం పట్టణంలో శనివారం భక్త కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా శాసనసభ్యులు ఎంపీలతో కలిసి ఎమ్మెస్ రాజు భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలవేసి నివాలులు అర్పించారు. భక్త కనకదాసు కురబలకే కాకుండా ప్రతి ఒక్కరికి మార్గ నిర్దేశకుడని కొనియాడారు.