మండపేట: ఎన్నికల సందర్భంగా మండపేట పట్టణంలో పోలీసులు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ...
మండపేట టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండపేట టౌన్ ఎస్ఐ హరికోటి శాస్త్రి మండపేట బస్టాండ్ సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు.ఎన్నికల సందర్భంగా అన్ని వెహికల్స్ తనిఖీ చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులను , ఇతర వాహనాలు అన్నింటినీ తనిఖీ చేశారు. ఈ కార్య్రమంలో ఏ ఎస్ ఐ చిన్నారావు, పోలీసులు, అదనపు పోలీసు సిబ్బంది వున్నారు.