కొల్లాపూర్: నార్లపూర్ రిజర్వాయర్ సవాల్: మంత్రికి నిరంజన్ రెడ్డి కౌంటర్
నార్లపూర్ రిజర్వాయర్ నుండి నీటి తరలింపుపై మంత్రి కృష్ణారావు సవాల్‌ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వీకరించారు. తుండు కట్ట తొలగిస్తే గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించవచ్చని, చేతకాకపోతే కాంట్రాక్ట్ ఇస్తే తామే నీళ్లు నింపి చూపిస్తామని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.