అశ్వారావుపేట: వివాహిత అదృశ్యంపై భర్త ఫిర్యాదు మేరకు ములకలపల్లి పోలీసులు కేసు నమోదు
ములకలపల్లి మండలం పరిధిలోని వేపులగడ్డ గ్రామానికి చెందిన స్వప్న రాణి స్థానికంగా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది.. ఈనెల 15వ తేదీన ఉదయం ఏడున్నర గంటల కు తన ఇంటి నుండి ములకలపల్లి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వస్తానని ఇంట్లోంచి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త సుధాకర్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ బుధవారం తెలిపారు..