ఒంగోలు అర్బన్: 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్
Ongole Urban, Prakasam | Aug 3, 2026
ఆగస్ట్- 15 నాడు స్థానిక పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో నిర్వహించే 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా దేశభక్తిని ఇనుముడింప చేసే విధంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి. రాజబాబు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ పి రాజబాబు జిల్లా అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.