శ్రీకాకుళం: పోలీసు అమరవీరులకు మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నిమ్మాడలో అమరవీరుల చిత్రపటానికి మంత్రి అచ్చెన్నాయుడు నివాళులర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలను, త్యాగాలను ఆయన కొనియాడారు. ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణకు కృషి చేయాలని పోలీసులకు సూచించారు.