ఏటూరునాగారం: పంట పొలాల్లో కరెంటు ఉచ్చులు పెడితే కఠిన చర్యలు: ములుగు డిఎస్పి హెచ్చరిక
అటవీ జంతువుల కోసం పంట పొలాల్లో కరెంటు ఉచ్చులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు డిఎస్పి రవీందర్ హెచ్చరించారు. ప్రాణ నష్టం కలిగిస్తున్న ఈ ఉచ్చులకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని రైతులకు సూచించారు. సమాచారం తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.