అమలాపురం: కోనసీమ జిల్లాలో ఎన్నికల నామినేషన్ల వేళ భారీగా పెరిగిన పోలీసు భద్రత
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అమలాపురం సహా అన్ని మండల కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పర్యవేక్షణలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.