అనంతపురం జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన రైతులు గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట పదినిమిషాల సమయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ కు కార్గో విమానాశ్రయం వద్దని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నంపల్లి రైతు నారాయణ గ్రామస్తులు మాట్లాడుతూ చిన్నంపల్లి లో కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నారని పేపర్ లోను టీవీలోనూ కథనాలు వస్తున్నాయని అందువల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని తమకు కార్గో విమానాశ్రయం వద్దని కలెక్టర్ కోరామని చిన్నంపల్లి రైతులు పేర్కొన్నారు.