కడ్తాల్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదవారి సొంతింటి కల సాకారం అవుతుంది: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండల పరిధిలోని కొండ్రిగానిబోడు తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని గురువారం సాయంత్రం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పక్కా ఇల్లు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.