కొత్తపేట: ఆత్రేయపురంలో వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన మండల వైస్ ప్రెసిడెంట్ మరియు 50 మంది
ఆత్రేయపురం మండల వైసీపీ వైస్ ప్రెసిడెంట్ గంటి నాగేశ్వరరావు తన 50 మంది అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము పార్టీలో చేరామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.