పార్వతీపురం: 28 రోజులుగా కొనసాగుతున్న జంఝావతి సాధన దీక్షలు
పార్వతీపురంలో జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ 28 రోజులుగా సాధన దీక్షలు కొనసాగుతున్నాయి. 1976 నుండి పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు వల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని సమితి నాయకులు తెలిపారు.