గుంతకల్లు: పామిడిలో కిరాణా దుకాణంలో నరసింహస్వామి మాస్క్ ధరించి చోరీ, సీసీ టీవీ కెమరాలో రికార్డయిన దృశ్యాలు
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఓ దొంగ మాస్క్ ధరించి చోరీ చేసిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పామిడి పట్టణంలోని మెయిన్ బజార్ లో జీఆర్ఎస్ జనరల్ కిరాణా దుకాణంలో గత 15 రోజులుగా చోరీలు జరుగుతున్నాయి. దుకాణంలో సరుకులు, చిల్లర నాణేలు, వస్తువులు చోరికి గురి అవుతున్నాయి. అనుమానం వచ్చిన యజమాని దుకాణంలో సీసీ టీవీ కెమెరాను అమర్చాడు. అయితే ఈ నెల 6న రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి రెయిన్ కోట్, నరసింహ స్వామి మాస్క్ ధరించి చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమరాలో రికార్డు అయ్యాయి.