అచ్చంపేట: అచ్చంపేటలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట పటిమను, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.