కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వైద్యాధికారి డాక్టర్ మదన్ శేఖర్ అధ్యక్షతన పల్స్ పోలియోపై టాస్క్ఫోర్స్ సమావేశం జరిగింది. 36 కేంద్రాల్లో 5081 మంది ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో రాముడు, డాక్టర్ నాగరాజు, డిప్యూటీ హెచ్ఈఓ శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.