ఒంగోలు అర్బన్: అద్దంకి డివిజన్లోని ప్రమాదాలు జరిగే పలు జంక్షన్ ను పరిశీలించి సూచనలు ఇచ్చిన జిల్లా ఎస్పీ కలెక్టర్
Ongole Urban, Prakasam | Jul 30, 2026
అద్దంకి డివిజన్లోని బంగ్లా రోడ్డు, భవాని సెంటర్, ద్వారకా నగర్ , సింగరకొండ జంక్షన్జ్ కొమ్మలపాడు ఏల్చూరు మరియు సంతమాగులూరు జంక్షన్ వద్ద ప్రమాదకర పరిస్థితి ఉన్న కూడళ్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో డ్రోన్ ద్వారా సర్వే నిర్వహించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. రోడ్లపై వాహనాలను నిలుపైన వారిపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందని ఆయన తెలిపారు.