శ్రీశైలం: బక్రీద్ పండుగ పురస్కరించుకొని పీస్ కమిటీ సమావేశం నిర్వహించిన ఆత్మకూరు పోలీసులు
రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ఆత్మకూరు టౌన్‌లోని ఎంఎం ఫంక్షన్ హాల్‌లో ఆత్మకూరు ఎస్డీపీఓ, సీఐ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సమావేశంలో చర్చించారు. పట్టణంలో మత సామరస్యాన్ని, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ప్రజలకు సూచించారు.సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు, పాత వీడియోలు లేదా రెచ్చగొట్టే కామెంట్లు చెస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.