పలమనేరు: ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఓ యువకుడుతో పాటు మరో మహిళ తీవ్ర గాయాలతో ఆసుపత్రి వద్దకు వచ్చారని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో చికిత్స అందిస్తుండగా మద్యం తాగి ఉన్న యువకుడు విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ సర్జికల్ బ్లేడ్ తో వైద్యులను ఇక్కడ పనిచేస్తే వారి పట్ల సైకోలాగా ప్రవర్తించాడని తెలిపారు. దీంతో భయభ్రాంతులకు గురై స్థానిక పోలీసులకు సమాచారం అందించామన్నారు. కాగా అతనితో పాటు వచ్చిన యువతి మరియు అతను పోట్లాడుకొని తీవ్ర గాయాలపాలై ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు మహిళకు చికిత్స అందిస్తున్నాము సైకో లాగా ప్రవర్తిస్తున్న వ్యక్తి చికిత్సకు సహకరించలేదని తెలిపారు.