గ్రామ, వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి-రాష్ట్ర అధ్యక్షుడు అశ్వర్థ
గ్రామ, వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశ్వర్థ డిమాండ్ చేశారు. హిందూపురంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో జరిపే చర్చల్లో దివ్యాంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని జేఏసీ నాయకులను కోరారు. సమాజంలో దివ్యాంగ ఉద్యోగుల స్థితిగతులను, వారి దీన పరిస్థితి అర్థం చేసుకొని వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగులకు కోసం క్షేత్రస్థాయి విధులు, ఆధార్ సెంటర్స్, బిఎల్ఓ డ్యూటీస్, ఇన్చార్జి డ్యూట