మామిడి కాయలు కిలో రూ.8 కనీస ధరగా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, పల్ప్ ఫ్యాక్టరీలు మాత్రం కిలో రూ.3 చెల్లించి, రైతులు అన్యాయం చేస్తున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. రైల్వేకోడూరు లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున రూ.4 సబ్సిడీ అందించటం ద్వారా, రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే, ఫ్యాక్టరీలు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఫ్యాక్టరీ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.