కాకినాడ సిటీ: కాకినాడ: విదేశీయుల వివరాలు నమోదు చేయని హోటళ్లకు భారీ జరిమానా, ఎస్పీ హెచ్చరిక
కాకినాడ జిల్లాలో విదేశీయులకు వసతి కల్పిస్తున్న సంస్థలు 24 గంటల్లోగా వారి వివరాలను Form-III ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే 50 వేల నుంచి లక్ష వరకు జరిమానా, క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.