సంగారెడ్డి: పెండింగ్స్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని కోరుతూ పిడిఎస్ యు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట పిడిఎస్యు ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ కింద రావలసిన 200 కోట్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.