హత్నూర: నవ పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో బిజెపిలో చేరిక
సంగారెడ్డి జిల్లా నవాబ్పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో బుధవారం బిజెపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నవబ్ పేట గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లతో సహా గెలిచి కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నాగ ప్రభువు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాజమల్లారెడ్డి బిజెపి నాయకులు చంద్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.