ఖాజీపేట: హనుమకొండ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు
హనుమకొండ జిల్లా తరాలపల్లి శివారులో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడటంతో మడికొండకు చెందిన హేమలత (36) మృతి చెందారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.