శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ నంబుల పూలకుంట మండల పరిధిలో మర్రి కొమ్మ గిన్నెలో రైతు ఈశ్వర్ రెడ్డి 4 ఎకరాల పొలంలో సాగుచేసిన కళింగర పంటను ఏవో లోకేశ్వర్ రెడ్డి, ఉద్యాన అధికారి ప్రతాపరెడ్డిలు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా పరిశీలించారు. కలింగర కర్బూజా పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అదేవిధంగా మండలానికి 1000 క్వింటాళ్ల ఉలవలు మంజూరయ్యాయని, రైతులు రైతు సేవ కేంద్రంలో రెండు రోజుల్లో నమోదు చేసుకోవాలని తెలియజేశారు.