కర్నూలు: కర్నూలు జిల్లాలో చిరుత కలకలం
హల్చల్ చేసింది. బసన్నగొట్టు దగ్గర చిరుతను చూసిన రైతులు గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో పెద్ద ఎత్తున గ్రామస్థులు చూసేందుకు తరలివచ్చారు. అయితే చిరుత గొంతులో ఎముక ఇరుక్కొని, కదలలేని స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.