ఒంగోలు అర్బన్: రిటైర్డ్ పోలీసు ఉద్యోగులను సన్మానించిన ఎస్పీ హర్షవర్ధన్
Ongole Urban, Prakasam | Jul 31, 2026
పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన వారిని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, వెండి జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు జిల్లా పోలీసు పరిపాలనలో అత్యంత కీలకమైనదని, జిల్లా పోలీసు కార్యాలయంలో రోజువారీ పరిపాలనా వ్యవహారాలు, వివిధ సెక్షన్ల పనితీరు, ఫైళ్ల నిర్వహణ, పరిపాలనా సమన్వయం వారి పర్యవేక్షణలోనే కొనసాగుతాయన్నారు.