జహీరాబాద్: డిడిఎస్ కెవికి ఆధ్వర్యంలో కంది సాగు పై రైతులకు శిక్షణ
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని గొట్టిగారపల్లి గ్రామంలో డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మోడల్ పల్స్ విలేజ్ ప్రాజెక్టులో భాగంగా కంది సాగు పై రైతులకు శిక్షణ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కె.వి.కె శాస్త్రవేత్తలు మాట్లాడుతూ సేంద్రీయ ఎరువులతో పంటలు అధిక దిగుబడి వస్తాయని సూచించారు. కషాయాల తయారీ, వేప నూనె వాడకం, పర్యావరణానికి అనుకూలమైన పద్ధతులను అవలంబించేలా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు డిడిఎస్ కెవికి సిబ్బంది పాల్గొన్నారు.