అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని నాగసముద్రం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి చీని చెట్లు దగ్ధమయ్యాయి. మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన రైతు నాగేంద్ర రెండు ఎకరాల వ్యవసాయ పొలంలో చీనీ చెట్లు నాటాడు. మొక్కలకు నీరు పెట్టేందుకు పొలంలో బోరు వేయించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించాడు. అయితే శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ నుంచి అగ్గి రవ్వలు ఎగిసిపడి చెత్తాచెదారం అంటుకుంది. భారీగా గాలులు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. రూ.2లక్షలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.