శ్రీశైలం: సున్నిపెంటలో ఇంటి ఆవరణలో ఉన్న కోడిని వేటాడేందుకు వచ్చిన చిరుత
శ్రీశైలం మండలం సుండిపెంట జెన్ కో సమీపంలో తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపింది ఓ ఇంటి ముందు ఇనుప బాక్స్ లో ఉన్న కోడిని తినేందుకు ప్రయత్నించింది చిరుతపులి సంచార దృశ్యాన్ని స్థానికులు వారి ఫోన్లలో చిత్రీకరించారు సుండిపెంట శివారు ప్రాంతాల్లో ఇటీవల తరచుగా చిరుతపులులు కనిపిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు అయితే రాత్రివేళ,తెల్లవారు సమయంలో స్థానిక ప్రజలు బయటకు వచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.