డోన్: బేతంచెర్ల మండలంలో అక్రమ సంబంధం ఉందని ఓ వ్యక్తిపై వేట కొడవలితో దాడి, కేసు నమోదు
Dhone, Nandyal | Oct 2, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బలపాలపల్లెలో చిన్న తిమ్మయ్యపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వేట కొడవలితో దాడి చేశాడని ఎస్సై రమేశ్‌బాబు తెలిపారు. తన భార్యతో చిన్న తిమ్మయ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.