ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా చింతలపల్లిలో 10 అడుగుల కొండచిలువ కలకలం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలోని చెరువు సమీపంలో 10 అడుగుల కొండచిలువ కనిపించింది. స్థానికులు భయాందోళనలకు గురై ఆ కొండచిలువను చంపేశారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.