కౌతాళం :మండలం మండల పరిధిలోని ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో ఆలయ అధికారిణి వాణి ఆధ్వర్యంలో సహస్ర దీపోత్సవం బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సహస్రదీపోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.