శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాస శివదీక్షా విరమణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది,ఇందులో భాగంగా స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి, విశేష పూజలు నిర్వహించారు,అనంతరం మంగళ వాయిద్యాల నడుమ, వేదమంత్రాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి శివదీక్ష శిబిరాలలో వేంచేపు చేయించారు,ఈ కార్య క్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు,