శ్రీశైలం: మనవడు ప్రపంచ రికార్డు సాధించడంతో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ను దర్శించుకున్నారు. ఆలయం రాజగోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో 2 సంవత్సరాలు 11 నెలల వయసులో మనవడు కొండ శ్రేయాన్స్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డు సాధించడంతో, స్వామి అమ్మవార్లకు కృతజ్ఞతగా ఈ దర్శనం నిర్వహించారు.