ఎమ్మిగనూరు: గోనెగండ్ల పరిధిలోని నేరుడుప్పలలో ఉల్లి రైతు తీవ్ర నష్టం, 1.8 ఎకరాల్లో ఉల్లి పంటను ట్రాక్టర్ తో దున్ని వేశాడు
నేరుడుప్పలలో రైతన్నల దీనస్థితి.. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల మండల పరిధిలోని నేరుడుప్పలలో రైతన్నలకు దీన పరిస్థితి నెలకొంది. హుస్సేనప్ప అలియాస్ ఏసోబు తనకున్న 1.80 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశాడు. చేతికి వచ్చిన పంటను ధర లేకపోవడంతో ట్రాక్టర్ తో దున్ని వేశాడు. ఈ సన్నివేశం పలువురిని కంటతడి పట్టించింది. చేతికి వచ్చిన పంట ఇలా దున్ని వేయడంతో తనకు సుమారు రూ. రెండు లక్షల వరకు అప్పులు మిగిలాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.