చీమకుర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కౌన్సిల్ సమావేశంలో 2026 -27 సంవత్సరానికి సంబంధించి మున్సిపల్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ తెలిపారు. మొత్తం రూ.19 కోట్ల 49 లక్షల 18వేలతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టి కౌన్సిల్ సభ్యుల ఆమోదం పొందినట్లు కమిషనర్ తెలిపారు. చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు.