పార్వతీపురం: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: హెచ్చరించిన న్యాయమూర్తి మాధురి
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని న్యాయమూర్తి ఎం. మాధురి తెలిపారు. సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.