శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో భక్తుల మెరుగైన సౌకర్యాల కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఈవో శ్రీనివాసరావు
దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఉద్యోగి భక్తుల సేవనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు. పరిపాలన భవనంలో జరిగిన ఈ సమావేశంలో దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, ఉచిత ప్రసాదం, శౌచాలయాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై సమీక్షించారు. భక్తుల నుంచి కనీసం 90 శాతం సానుకూల స్పందన వచ్చేలా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదం, ఆలయ ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతి సారి ఒకే రుచి, నాణ్యత, పరిమాణం ఉండేలాన్నారు.