చొప్పదండి: ఊరికి బస్సు కావాలని అడిగినందుకు పోలీసులతో కొట్టించడమేమిటి :చొప్పదండి లో మీడియా ముందు ప్రశ్నించిన మాజీ MLA సుంకే రవిశంకర్
కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు,అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులు సోమవారం 6:20 PM కి చొప్పుదండి మాజీ MLA సుంకే రవిశంకర్ పరామర్శించి అనంతరం కరీంనగర్ & చొప్పదండిలో మీడియాతో మాట్లాడారు,బండారి శ్రీనివాస్ అనే వ్యక్తి మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని అడిగినందుకు MLA మేడిపల్లి సత్యం పోలీసులతో కొట్టించడంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని చొప్పదండి మాజీ MLA శంకర్ అన్నారు,ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు,