మేకనూరు రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా జరుగుతున్న తెల్లరాయి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు
తిరుపతి జిల్లా గూడూరు మండలం మేకనూరు రెవెన్యూ పరిధిలో తెల్లరాయిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆందోళన చేపట్టారు. అక్రమ రవాణాలను వైసీపీ అధికార నేత అడ్డుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.