కథలాపూర్: విద్యుత్ సరఫరాలో అంతరాయం.. వినియోదారులు గమనించి సహకరించాలి: అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ పి.దయాకర్
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ సబ్ స్టేషన్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కరెంట్ ఉండదని అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ పి.దివాకర్ తెలియజేశారు.ఈ మేరకు కథలాపూర్, సిరికొండ,దూలూరు, పోసానిపేట,దుంపేట గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఇందుకు విద్యుత్ వినియోగదారులు,రైతులు సహకరించాలని ఆయన సోమవారం ఉదయం ప్రకటన ద్వారా కోరారు.